
నాకు ఆరు సంవత్సరాలు ఉంటాయెమొ అప్పుడు. వేసవి కాలం. ప్రతీ సంవత్సరం లాగె మా నాన్నగారు మామిడిపండ్లు తెచ్హారు. ఏందులొనైన నీనె ముందు ఉండాలి అనేది నా పాలసి (ఇప్పటికి కూడా అనుకొండి). పరుగున వెళ్లి ఒక మంచి పెద్ద కాయ తిసుకుని తినడం మొదలుపెట్టా (పచ్హి బంగినపల్లి కాయ) . మూడు సార్లు కొరికనో లెదో (అప్పటికె ఉడటానికి సిద్దంగా ఉన్న ) నా ముందు పన్ను ఊడి వచ్హెసింది.
మా ఇంట్లో వాళ్లు "మాములుగా కూడా పళ్లు ఊడతాయి " అని ఎంత చెప్పినా నీను నమ్మలెదు. నాకు ఖచ్హితంగాతెలుసు. అది మామిడికాయ వల్లే ఊడింది. ఇంకా దాని వల్లే తొండ కూడా దూరుతుందట. అంతే, నాకు మమిడికాయ మీద చాల కొపమొచ్హింది. ఆ సంవత్సరం మామిడి కాయలు తినలేదు.మా అన్నయ ఆనందం చూడాలి, నా వాటా మామిడి పండ్లు కూడా తనే తిన్నాడు.
నా రెండో పన్ను ఊడే వరకు "మామిడికాయ నా శత్రువు" గానే ఉంది