BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS

Monday, September 7, 2009

"ఆనందం" మీకు తెలుసా?
ముందు మాట: నీ నేంటీ, బ్లాగ్ ఎంటీ, ఆనందం మీద పొస్ట్ రాయడమేంటి..... ఒకవేళ నా స్నేహితులు ఎవరైనా చదివితే కనీసం ఒక్కరికో, ఇద్దరికో హార్ట్ ఎటాక్ వస్తుంది. తర్వత కచ్చితంగా నాకు ఎదో అయిపోయిందని నిర్నయానికి వచ్చి నా మీద జాలి పడే చాన్స్ లేకపోలేదు. ఏది ఏమైనా నీను పొస్ట్ రాయాలని డిసైడ్ చేసాను.ఎందుకంటే నాకు ఆనందం అంటే ఎమిటో నిన్నే తెలిసింది. నాలా ఎంతమంది ఉన్నారొ నాకు తెలియదు. ఇది వారికి ఉపయోగ పడుతుందెమో అని పొస్ట్ వ్రాస్తున్నాను.మీకు తెలుసా ?

1. "ఆనందం" & "సుఖం" వేరు వేరని ?మీరు చాల ఉన్నతిలొ ఉన్న, అన్ని సదుపాయాలు ఉన్న, ఏది కావలంటే అది చేయగలిగిన, ఏది కొరుకుంటె అది పొందగలిగిన వాళ్లని అడిగి చూడండి. నూటికి 95 % మంది ఆనందం గా ఉండటం లేదు.అదే కనీస సదుపాయాలు కూడా లేని వాళ్లు నూటికి 35 % ఆనందం గా ఉన్నామని చెపుతున్నరు.ఆంటే సుఖం ఆనందాన్ని ఇవ్వడం లేదా? దానికి ప్రధాన కారణం కోరికలని నేననుకుంటున్నాను. కోరికలు మనకి ఆనందం లేకుండా చేస్తున్నాయా?.... ఆలోచించండి.ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. మనలో చాలామంది సుఖాల కొసం ఆనందన్ని వదిలేస్తున్నరు. అది ఎంతవరకు సమంజసం.
2. ఆనందం అంటే ఏమిటి?
అనందం అనేది వస్తువు కాదు. ఒక అనుభూతి మాత్రమే...


3. ఆనందం ఎందులొ ఉంటుంది?కొట్లకు కోట్లు డబ్బు సంపాదిస్తే ఆనందం వస్తుందా......కాదనే చెప్పలి. పెద్ద ఇల్లు, కీర్తి, చుట్టాలు, స్నేహితులు ఉంటే వస్తుందా.......కాదనే చెప్పలి.
కానీ ప్రేమిస్తే వస్తుంది ఆనందం. అది ఏదైనా సరే. అంటే చేసే పని కావచ్చు, వ్యక్తి కావచ్చు..... వస్తువు కావచ్చు. వొకరి ప్రేమని పొందడంలొ కూడ ఆనందం దొరుకుతుంది.4. మీ ద్రుస్ఠిలో ఆనందం ఏంటి?


నేనొక చిన్న సర్వే చేసాను. నా స్నేహితులకి ఆనందం అంటే ఎం తెలుసా అని. 25 % మంది తెలియదు.. చెప్పలేం అన్నారు. 40 % మంది సుఖంగా ఉండటమే ఆనందం అన్నారు. 25% మంది ఏది తలుచుకుంటే అది చేయగలగడమే ఆనందం అన్నారు. 10 % మంది కళలు,దేముడు... వీటికి దగ్గరగా ఉండటమే ఆనందం అన్నరు.
మరి మీ ద్రుస్ఠిలో ఆనందం అంటే ఎమిటో అలోచించండి...5. మీరు ఆనందంగా ఉన్నారా ? ఉంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆనందంగా ఉన్నారొ లెక్కపెట్టగలరా?
ఒకవేళ మీరు ఆనందంగా ఉన్నట్లయితే మీరు చాలా అద్రుస్టవంతులు. ఆదే ఆనందంగా లేకపొతే ....... ఎందుకు ఆనందన్ని మిస్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు.. ఎంత ఆనందంగ జీవించమన్నది ముఖ్యం. మనం బ్రతికి ఉండే ప్రతి నిముషాన్ని ఆనందించగలిగితే ఎంత బాగుంటుంది. అది మీ చేతిలొనే ఉంది. సమయాన్ని జారవిడుచుకోకండి.6. ఆనందం లో పర్సెంటేజ్(%) లు ఉన్నాయని మీకు తెలుసా ?


ఆనందంగా ఉన్నారా.. ఉంటే ఎంత % ఆనందంగా ఉన్నారు.. ఎం చేస్తే మీ ఆనందం 100 % అవుతుంది..
7. ఆనందంగా ఉన్న వారికి ఆయుర్ధాయం పెరుగుతుందని మీకు తెలుసా?


ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆనందం గురించి అలోచిస్తే కొన్ని ప్రశ్నలు వచ్చాయి.

రేపటి తరం ఆనందం గా ఉందా (ఉంటుందా) ?

పోటీ చదువులు, కంప్యుటర్లు , వీడియో గేంలు ఇవన్నీ పిల్లల్లో సహజమైన ఆనందన్ని దూరం చేస్తున్నాయి

కార్పొరేట్ ప్రపంచం వచ్చాక, 24 గంటలు పనిచెసె అఫీసు లు , ప్రతి నెలా మారే షిఫ్టులు, ఒక మొక్క కూడా పెంచుకోలేని అపార్టుమెంటులు, దేముడితో బిసినెస్ చేసే మనుషులు....... ఇవన్ని ఆనందన్ని ఇస్తున్నాయా ?

ఇక్కడ మీకొక విషయం చెప్పాలి.

దైవత్వం, మానవత్వం, పసుత్వం... మూడు గుణాలు ప్రతి మనిషిలోను ఉంటాయి.
ఏది ఎంత % మీలొ ఉంది అనేదాన్ని బట్టి మీ అనందం ఉంటుంది అని చెప్పుకోవచ్చు.


గమనిక: నాకు ఆనందం అంటె ఏదో తెలుసని పొస్ట్ రాయలేదు. నా లాగే ఇంక ఎవరైన తెలియని వాళ్లు ఉంటె వాళ్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తరెమో అని.అయ్య బాబోయ్............ నేను ఏంటీ.. నా పొస్ట్ ఏంటీ. నిజం చెప్పాలంటె నాకే నమ్మకం రావట్లే. ఇలాంటి పొస్ట్ నేను రాస్తానని నా జీవితంలో అనుకోలేదు. ఏమైనా తప్పుగా చెప్పి ఉంటె క్షమించండి. మీకు ఏమైన చెప్పాలనిపిస్తే నాకు చెప్పండి. తెలుసుకుంటాను.

Wednesday, September 2, 2009

స్నేహం...


నాకు నచ్చిన కవిత.....మీకొసం


"కిరణానికి చీకటి లేదు..

సిరిమువ్వకి మౌనం లేదు.

చిరునవ్వుకి మరణంలేదు.

మన స్నేహనికి అంతంలేదు.

మరిచే స్నేహం చెయ్యకు.

చేసే స్నేహం మరవకు ......"

Saturday, August 22, 2009

వినాయకా - నీకు పుట్టిన రోజు సుభాకాంక్షలుప్రతి సంవత్సరం లాగె ఈ సారి కూడా వినాయకుడి పుట్టినరోజు మనమందరం ఘనంగా జరుపుకొవాలని ఆసిస్తూ మీ అందరికి నా వినాయక చవితి సుభాకాంక్షలు.

మన అందరి తరుపునుంచి వినాయకుడికి పుట్టిన రోజు సుభాకాంక్షలు ........

Friday, August 14, 2009

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
" జన గణ మన అధినాయక జయ హే
భారత భాగ్య విధాతా
పంజాబ్ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కల వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్చల జలధి తరంగా
తవ శుభ నామె జాగె
తవ శుభ ఆషిష మాగె
గాహె తవ జయ గాధా
జన గణ మంగలదాయక జయ హే
భారత భాగ్య విధాతా
జయ హే ! జయ హే ! జయ హే !
జయ, జయ, జయ, జయ హే "

జయ్ హింద్...........

నేను - ఆధ్యాత్మికం
నాకు 2 సంవత్సరాలు ఉంటాయెమో అప్పుడు, నేను మొదట నెర్చుకున్న శ్లోకం
" శ్రీ రాఘవం దశరదాత్మజ మప్రమేయం
సీతా పతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయ తాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి !"

ఆలా నాకు రాముడు మొదటి దేముడయ్యడు.
ఇకపొతే భక్తి విషయానికొస్తే నాకు కొంచం తక్కువని నే ననుకొంటుంటాను (మా అన్నయ కన్న). అలా అనుకొడానికి కారణం లేకపోలేదు. నా 1వ తరగతిలొ నాకు దుర్గ అనే స్నెహితురాలు ఉండేది. అది మాట్లదితే చాలు నీను దుర్గాదేవి ని అని చెప్పేది. నీను దేవత, మీరు మనుషులు అనేది. అలా చెప్పి భయపెట్టి మా దగ్గర అన్ని కొట్టేసేది. నేను దేవత కానందుకు కొంచం బాధపద్దను అప్పుడు. ఒకవేళ నాకు దేవత అయ్యె అవకాశం వస్తే దుర్గా దేవి కన్నా శక్తి వంతమైన దేవత అవ్వాలని కలలు కన్నాను. ఎన్ని రోజులు ఎదురు చూసినా నా కల నిజం అవ్వకపొయే సరికి, ఇక నీను ఈ జన్మలొ దేవత అవ్వనని డిసైడ్ అయ్య.మా అమ్మ అప్పటిలో శ్రావణ మంగళవారం వ్రతం చేసేది.ఇక నాకు ఎంచేయాలొ తెలియక మా అమ్మ నడిగా ఆ దేవత మనకేమవుతుంది అని. "అమ్మ" అవుతుందని చెప్పింది. మనతో ఎప్పుడూ తోడుగా ఉంటుందని,మనకెప్పుడు ఎది ఇవ్వలొ అది ఇస్తుందని.... అంతే...

ఇక స్కూలు కెళ్లి "పార్వతి దేవి మా అమ్మ. నన్ను ఎడిపిస్తె ఎవరైనా సరే కొడుతుతుంది" అని చెప్పడం మొదలుపెట్టా. పాపం మా దుర్గ కూడా భయపడి నన్ను ఏడిపించడం మానేసింది. కాని నేను ఆ రోజు నుంచి ఏ దేవుడినైనా సరే, ఏదొ ఒక వరస పెట్టి పిలుచుకునేదాన్ని. అలా నాకు అందరు దేవుళ్లు బందువులయ్యారు. కాదు, కొంచం పెద్దయ్యెదాక అదే ఫీలింగ్ లొ ఉందేదాన్ని.

ఇకపోతె నాకు రోజూ గుడికెళ్లే అలవాటు (ఇప్పటికి...).మా మామయ్య శివాలయం లో అర్చకత్వం చేస్తారు.గుడి వాళ్లదే. అందుకని నేను రోజు దానికే వెళ్లె దాన్ని. అప్పుడప్పుడూ మా మామయ్య కొడుకు ఉండేవాడు (తిరుపతి లో వేదం నెర్చుకునేవాడు. సెలవలకు వచ్చెవాడు).నా పాలిటి రాక్షసుడు.నాకు పూలంటె పిచ్చి. అందుకని గుడి లొపలికెళ్లి నీకు నచ్చిన పూలు తెచ్చుకో అని చెప్పి, తీర నేను లోపలికెళ్లాక బయటనుంచి తాళం వేసేవాడు. ఇక చూసుకొండి, నా పరిస్తితి. చాల భయమేసేది. నేను ప్రతీ సారి మొసపొయే దాన్ని. ఎప్పుడూ అంతె. ఒక గంట వరకు తాళం తీసెవాడు కాదు. ఇక లాభం లేదని, దేముడిని ఫ్రెండ్" అని అనుకోవడం మొదలుపెట్టా. అప్పటినుంచి నాకు అందరు దేముళ్లు స్నేహితులయ్యారు.

ప్రతీ రోజు గుడి కెళ్లడం, దేముడికి "హయి" చెప్పడం అలవాటైంది.(ఇప్పటికీ...). నాకు ఎంత ఫ్రెండ్స్ అయ్యారంటే, ఈ సంవత్సరం భద్రాచలం రాములువారి కళ్యాణం అక్షింతలు ఎవరో ఇస్తే,కొన్ని దాచిపెట్టి తీసుకెళ్లి ఆంజనేయస్వామి గుడిలో హనుమంతునికి (పూజారికి తెలియకుండా) వేసొచ్చె అంత.


అలా నాకు భక్తి కన్నా దేముడితో స్నేహం పెరిగింది. కానీ మా అన్నయ కోసం నేను కొన్ని శ్లోకాలు చదవడం అలవాటు చెసుకున్నా.తప్పు, తప్పు, చేసుకోవలసి వచ్చింది. అందులో ముఖ్యంగా నవగ్రహ శ్లోకాలు. చదవడం వల్ల నాకు మంచి జరుగుతుందని నాచేత మొదలుపెట్టిచ్చాడు.తర్వాత నాకే ఎందుకో మంచిగా అనిపించి చదువుతాననుకొండి.

అలా నాకు భక్తి తక్కువ అనే అభిప్రాయం నాది. ... మీరేమంటారు?

Tuesday, August 4, 2009

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలుప్రతి సంవత్సరం నీను ఎంతగానో ఎదురుచుసే రాఖీ వచ్హేసింది. ..
బ్లాగు మిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు....

Friday, July 31, 2009

మామిడికాయ మీద కోపం


నాకు ఆరు సంవత్సరాలు ఉంటాయెమొ అప్పుడు. వేసవి కాలం. ప్రతీ సంవత్సరం లాగె మా నాన్నగారు మామిడిపండ్లు తెచ్హారు. ఏందులొనైన నీనె ముందు ఉండాలి అనేది నా పాలసి (ఇప్పటికి కూడా అనుకొండి). పరుగున వెళ్లి ఒక మంచి పెద్ద కాయ తిసుకుని తినడం మొదలుపెట్టా (పచ్హి బంగినపల్లి కాయ) . మూడు సార్లు కొరికనో లెదో (అప్పటికె ఉడటానికి సిద్దంగా ఉన్న ) నా ముందు పన్ను ఊడి వచ్హెసింది.

అంతే, ఒకటే ఎడుపు. ఏమని ఎడిచానో తెలుసా "మామిడి కాయ మంచిది కాదు, నా పన్ను పీకేసింది". అదే మొదటి సారి నాకు పన్ను ఉడటమేమొ చాల భాద పడ్డా. రెండు రోజుల వరకు ఎడుస్తూనే ఉన్నా . ఇంతలో మా అన్నయ్య నన్ను తొస్సి పన్ను లో తొండ దూరుతుంది అని ఎడిపించడం మొదలుపెట్టాడు. "గోరు చుట్టు మీద రొకటి పోటు" లా మా అన్న మాటలు ఇంకా భయపెట్టాయి . అసలే పన్ను ఉడిపొయిన భాదలొ నేనుంటే మళ్లి తొండ ఎక్కడ దురుతుందో అని నోరు తెరవడం మానేసా (మరీ అవసరమయినప్పుడు తప్ప). కొన్ని రోజులు నిద్రపొవలంటే కూడా భయమేసెది, నిద్రలో వచ్హెస్తుందేమొ అని.

మా ఇంట్లో వాళ్లు "మాములుగా కూడా పళ్లు ఊడతాయి " అని ఎంత చెప్పినా నీను నమ్మలెదు. నాకు ఖచ్హితంగాతెలుసు. అది మామిడికాయ వల్లే ఊడింది. ఇంకా దాని వల్లే తొండ కూడా దూరుతుందట. అంతే, నాకు మమిడికాయ మీద చాల కొపమొచ్హింది. సంవత్సరం మామిడి కాయలు తినలేదు.మా అన్నయ ఆనందం చూడాలి, నా వాటా మామిడి పండ్లు కూడా తనే తిన్నాడు.

నా రెండో పన్ను ఊడే వరకు "మామిడికాయ నా శత్రువు" గానే ఉంది