BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS

Monday, September 7, 2009

"ఆనందం" మీకు తెలుసా?




ముందు మాట: నీ నేంటీ, బ్లాగ్ ఎంటీ, ఆనందం మీద పొస్ట్ రాయడమేంటి..... ఒకవేళ నా స్నేహితులు ఎవరైనా చదివితే కనీసం ఒక్కరికో, ఇద్దరికో హార్ట్ ఎటాక్ వస్తుంది. తర్వత కచ్చితంగా నాకు ఎదో అయిపోయిందని నిర్నయానికి వచ్చి నా మీద జాలి పడే చాన్స్ లేకపోలేదు. ఏది ఏమైనా నీను పొస్ట్ రాయాలని డిసైడ్ చేసాను.ఎందుకంటే నాకు ఆనందం అంటే ఎమిటో నిన్నే తెలిసింది. నాలా ఎంతమంది ఉన్నారొ నాకు తెలియదు. ఇది వారికి ఉపయోగ పడుతుందెమో అని పొస్ట్ వ్రాస్తున్నాను.







మీకు తెలుసా ?





1. "ఆనందం" & "సుఖం" వేరు వేరని ?







మీరు చాల ఉన్నతిలొ ఉన్న, అన్ని సదుపాయాలు ఉన్న, ఏది కావలంటే అది చేయగలిగిన, ఏది కొరుకుంటె అది పొందగలిగిన వాళ్లని అడిగి చూడండి. నూటికి 95 % మంది ఆనందం గా ఉండటం లేదు.అదే కనీస సదుపాయాలు కూడా లేని వాళ్లు నూటికి 35 % ఆనందం గా ఉన్నామని చెపుతున్నరు.



ఆంటే సుఖం ఆనందాన్ని ఇవ్వడం లేదా? దానికి ప్రధాన కారణం కోరికలని నేననుకుంటున్నాను. కోరికలు మనకి ఆనందం లేకుండా చేస్తున్నాయా?.... ఆలోచించండి.



ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. మనలో చాలామంది సుఖాల కొసం ఆనందన్ని వదిలేస్తున్నరు. అది ఎంతవరకు సమంజసం.








2. ఆనందం అంటే ఏమిటి?




అనందం అనేది వస్తువు కాదు. ఒక అనుభూతి మాత్రమే...






3. ఆనందం ఎందులొ ఉంటుంది?



కొట్లకు కోట్లు డబ్బు సంపాదిస్తే ఆనందం వస్తుందా......కాదనే చెప్పలి. పెద్ద ఇల్లు, కీర్తి, చుట్టాలు, స్నేహితులు ఉంటే వస్తుందా.......కాదనే చెప్పలి.
కానీ ప్రేమిస్తే వస్తుంది ఆనందం. అది ఏదైనా సరే. అంటే చేసే పని కావచ్చు, వ్యక్తి కావచ్చు..... వస్తువు కావచ్చు. వొకరి ప్రేమని పొందడంలొ కూడ ఆనందం దొరుకుతుంది.







4. మీ ద్రుస్ఠిలో ఆనందం ఏంటి?






నేనొక చిన్న సర్వే చేసాను. నా స్నేహితులకి ఆనందం అంటే ఎం తెలుసా అని. 25 % మంది తెలియదు.. చెప్పలేం అన్నారు. 40 % మంది సుఖంగా ఉండటమే ఆనందం అన్నారు. 25% మంది ఏది తలుచుకుంటే అది చేయగలగడమే ఆనందం అన్నారు. 10 % మంది కళలు,దేముడు... వీటికి దగ్గరగా ఉండటమే ఆనందం అన్నరు.




మరి మీ ద్రుస్ఠిలో ఆనందం అంటే ఎమిటో అలోచించండి...







5. మీరు ఆనందంగా ఉన్నారా ? ఉంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆనందంగా ఉన్నారొ లెక్కపెట్టగలరా?




ఒకవేళ మీరు ఆనందంగా ఉన్నట్లయితే మీరు చాలా అద్రుస్టవంతులు. ఆదే ఆనందంగా లేకపొతే ....... ఎందుకు ఆనందన్ని మిస్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు.. ఎంత ఆనందంగ జీవించమన్నది ముఖ్యం. మనం బ్రతికి ఉండే ప్రతి నిముషాన్ని ఆనందించగలిగితే ఎంత బాగుంటుంది. అది మీ చేతిలొనే ఉంది. సమయాన్ని జారవిడుచుకోకండి.







6. ఆనందం లో పర్సెంటేజ్(%) లు ఉన్నాయని మీకు తెలుసా ?


ఆనందంగా ఉన్నారా.. ఉంటే ఎంత % ఆనందంగా ఉన్నారు.. ఎం చేస్తే మీ ఆనందం 100 % అవుతుంది..




7. ఆనందంగా ఉన్న వారికి ఆయుర్ధాయం పెరుగుతుందని మీకు తెలుసా?


ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆనందం గురించి అలోచిస్తే కొన్ని ప్రశ్నలు వచ్చాయి.

రేపటి తరం ఆనందం గా ఉందా (ఉంటుందా) ?

పోటీ చదువులు, కంప్యుటర్లు , వీడియో గేంలు ఇవన్నీ పిల్లల్లో సహజమైన ఆనందన్ని దూరం చేస్తున్నాయి

కార్పొరేట్ ప్రపంచం వచ్చాక, 24 గంటలు పనిచెసె అఫీసు లు , ప్రతి నెలా మారే షిఫ్టులు, ఒక మొక్క కూడా పెంచుకోలేని అపార్టుమెంటులు, దేముడితో బిసినెస్ చేసే మనుషులు....... ఇవన్ని ఆనందన్ని ఇస్తున్నాయా ?

ఇక్కడ మీకొక విషయం చెప్పాలి.

దైవత్వం, మానవత్వం, పసుత్వం... మూడు గుణాలు ప్రతి మనిషిలోను ఉంటాయి.
ఏది ఎంత % మీలొ ఉంది అనేదాన్ని బట్టి మీ అనందం ఉంటుంది అని చెప్పుకోవచ్చు.


గమనిక: నాకు ఆనందం అంటె ఏదో తెలుసని పొస్ట్ రాయలేదు. నా లాగే ఇంక ఎవరైన తెలియని వాళ్లు ఉంటె వాళ్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తరెమో అని.



అయ్య బాబోయ్............ నేను ఏంటీ.. నా పొస్ట్ ఏంటీ. నిజం చెప్పాలంటె నాకే నమ్మకం రావట్లే. ఇలాంటి పొస్ట్ నేను రాస్తానని నా జీవితంలో అనుకోలేదు. ఏమైనా తప్పుగా చెప్పి ఉంటె క్షమించండి. మీకు ఏమైన చెప్పాలనిపిస్తే నాకు చెప్పండి. తెలుసుకుంటాను.

6 comments:

బృహఃస్పతి said...

Happiness is within your self. దీనిపై ఇప్పటి వరకు నిర్వచించిన వారిలో స్వామీ రామ తీర్థులు అత్యద్భుతంగా వివరించగలిగారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి...

http://vikaasam.blogspot.com/2009/07/blog-post_19.html

Unknown said...

చాలా బాగా చెప్పారండీ... బహుశా నేనో 25% ఆనందం తో , మరో 25% సుఖం తో బతుకుతున్నానేమో అనిపించిది. మంచి అర్ధవంతమైన విషయం తో బ్లాగ్ రాసారు. జంకు గొంకు లేకుండా ముందుకు సాగిపొండి.

శివ చెరువు said...

పావని గారు .. మొదటగా మీరు ఎంచుకున్న వస్తువుకు అభినందనలు

నేను కూడా ఆనందపు అన్వేషణ లోనే వున్నాను.. లెండి...

ఆనందం ఒక అనుభూతి మాత్రమే దానినిఎవరికైనా అన్వయించవచ్చు.. మంచి వారు చెడ్డ వారు అని లేకుండా..
ఎందుకంటే మనిషి కొన్ని భావోద్వేగాల సమాహారం. అందరూ ఒక దానినుండే ఆనందం పొందాలని లేదు. ఆనందం ఒక్క చోట లేదు.. కనుక ఆనందపు ఛాయలను వెంటాడే విధానం మనిషి మనిషి కీ మారి పోతూ వుంటుంది..

నాకు తెలిసిన సత్యం ఏమిటంటే... ఆనందంగా జీవించాలి కాని అది వేరొకరి ఆనందాన్ని దోచుకొని మాత్రం కాదు..

కొత్త పాళీ said...

నిజమే . చాలా మందికి ఆనందం అంటే ఏమిటో తెలీదు. ఎలాంటి జీవితం తమకి ఆనందం ఇస్తుందో అంతకన్నా తెలీదు. నిజమే.

విశ్వ ప్రేమికుడు said...

బాగుంది :)

cartheek said...

పావని గారు మీలో చాలా విజ్ఞత, ఎదుటివారిని ఆలోచింపచేసే శక్తి ఉంది...
మీకు ఇది రాసినపుడు ఎలా అనిపించిందో లేదో తెలియదు గాని చదివిన నాకు(నేను కూడా ఎపుడు ఇలాంటి విషయాల గురించే అలోచిస్తలెండి) మాత్రం ఏదో ఆ లోచన కలిగిందండి.........
మన ఆలోచనలు నలుగురికి ఉపయోగ పడుతూ, నలుగురిని ఆలోచింప చేసేవిగా ఉన్నప్పుడే మనకు మన జీవితానికి సార్ధకత అని నా ఉద్దేశం ఆ విషయంలో మీరు మొదటి మెట్టేక్కేసారు.....
ఇంకా ఇలానే చాలా మంచి విషయాలు మాకు అందిస్తారని కోరుకుంటూ
కార్తిక్...................................