BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS

Saturday, August 22, 2009

వినాయకా - నీకు పుట్టిన రోజు సుభాకాంక్షలు



ప్రతి సంవత్సరం లాగె ఈ సారి కూడా వినాయకుడి పుట్టినరోజు మనమందరం ఘనంగా జరుపుకొవాలని ఆసిస్తూ మీ అందరికి నా వినాయక చవితి సుభాకాంక్షలు.

మన అందరి తరుపునుంచి వినాయకుడికి పుట్టిన రోజు సుభాకాంక్షలు ........

Friday, August 14, 2009

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు




" జన గణ మన అధినాయక జయ హే
భారత భాగ్య విధాతా
పంజాబ్ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కల వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్చల జలధి తరంగా
తవ శుభ నామె జాగె
తవ శుభ ఆషిష మాగె
గాహె తవ జయ గాధా
జన గణ మంగలదాయక జయ హే
భారత భాగ్య విధాతా
జయ హే ! జయ హే ! జయ హే !
జయ, జయ, జయ, జయ హే "

జయ్ హింద్...........

నేను - ఆధ్యాత్మికం




నాకు 2 సంవత్సరాలు ఉంటాయెమో అప్పుడు, నేను మొదట నెర్చుకున్న శ్లోకం
" శ్రీ రాఘవం దశరదాత్మజ మప్రమేయం
సీతా పతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయ తాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి !"

ఆలా నాకు రాముడు మొదటి దేముడయ్యడు.
ఇకపొతే భక్తి విషయానికొస్తే నాకు కొంచం తక్కువని నే ననుకొంటుంటాను (మా అన్నయ కన్న). అలా అనుకొడానికి కారణం లేకపోలేదు. నా 1వ తరగతిలొ నాకు దుర్గ అనే స్నెహితురాలు ఉండేది. అది మాట్లదితే చాలు నీను దుర్గాదేవి ని అని చెప్పేది. నీను దేవత, మీరు మనుషులు అనేది. అలా చెప్పి భయపెట్టి మా దగ్గర అన్ని కొట్టేసేది. నేను దేవత కానందుకు కొంచం బాధపద్దను అప్పుడు. ఒకవేళ నాకు దేవత అయ్యె అవకాశం వస్తే దుర్గా దేవి కన్నా శక్తి వంతమైన దేవత అవ్వాలని కలలు కన్నాను. ఎన్ని రోజులు ఎదురు చూసినా నా కల నిజం అవ్వకపొయే సరికి, ఇక నీను ఈ జన్మలొ దేవత అవ్వనని డిసైడ్ అయ్య.మా అమ్మ అప్పటిలో శ్రావణ మంగళవారం వ్రతం చేసేది.ఇక నాకు ఎంచేయాలొ తెలియక మా అమ్మ నడిగా ఆ దేవత మనకేమవుతుంది అని. "అమ్మ" అవుతుందని చెప్పింది. మనతో ఎప్పుడూ తోడుగా ఉంటుందని,మనకెప్పుడు ఎది ఇవ్వలొ అది ఇస్తుందని.... అంతే...

ఇక స్కూలు కెళ్లి "పార్వతి దేవి మా అమ్మ. నన్ను ఎడిపిస్తె ఎవరైనా సరే కొడుతుతుంది" అని చెప్పడం మొదలుపెట్టా. పాపం మా దుర్గ కూడా భయపడి నన్ను ఏడిపించడం మానేసింది. కాని నేను ఆ రోజు నుంచి ఏ దేవుడినైనా సరే, ఏదొ ఒక వరస పెట్టి పిలుచుకునేదాన్ని. అలా నాకు అందరు దేవుళ్లు బందువులయ్యారు. కాదు, కొంచం పెద్దయ్యెదాక అదే ఫీలింగ్ లొ ఉందేదాన్ని.

ఇకపోతె నాకు రోజూ గుడికెళ్లే అలవాటు (ఇప్పటికి...).మా మామయ్య శివాలయం లో అర్చకత్వం చేస్తారు.గుడి వాళ్లదే. అందుకని నేను రోజు దానికే వెళ్లె దాన్ని. అప్పుడప్పుడూ మా మామయ్య కొడుకు ఉండేవాడు (తిరుపతి లో వేదం నెర్చుకునేవాడు. సెలవలకు వచ్చెవాడు).నా పాలిటి రాక్షసుడు.నాకు పూలంటె పిచ్చి. అందుకని గుడి లొపలికెళ్లి నీకు నచ్చిన పూలు తెచ్చుకో అని చెప్పి, తీర నేను లోపలికెళ్లాక బయటనుంచి తాళం వేసేవాడు. ఇక చూసుకొండి, నా పరిస్తితి. చాల భయమేసేది. నేను ప్రతీ సారి మొసపొయే దాన్ని. ఎప్పుడూ అంతె. ఒక గంట వరకు తాళం తీసెవాడు కాదు. ఇక లాభం లేదని, దేముడిని ఫ్రెండ్" అని అనుకోవడం మొదలుపెట్టా. అప్పటినుంచి నాకు అందరు దేముళ్లు స్నేహితులయ్యారు.

ప్రతీ రోజు గుడి కెళ్లడం, దేముడికి "హయి" చెప్పడం అలవాటైంది.(ఇప్పటికీ...). నాకు ఎంత ఫ్రెండ్స్ అయ్యారంటే, ఈ సంవత్సరం భద్రాచలం రాములువారి కళ్యాణం అక్షింతలు ఎవరో ఇస్తే,కొన్ని దాచిపెట్టి తీసుకెళ్లి ఆంజనేయస్వామి గుడిలో హనుమంతునికి (పూజారికి తెలియకుండా) వేసొచ్చె అంత.


అలా నాకు భక్తి కన్నా దేముడితో స్నేహం పెరిగింది. కానీ మా అన్నయ కోసం నేను కొన్ని శ్లోకాలు చదవడం అలవాటు చెసుకున్నా.తప్పు, తప్పు, చేసుకోవలసి వచ్చింది. అందులో ముఖ్యంగా నవగ్రహ శ్లోకాలు. చదవడం వల్ల నాకు మంచి జరుగుతుందని నాచేత మొదలుపెట్టిచ్చాడు.తర్వాత నాకే ఎందుకో మంచిగా అనిపించి చదువుతాననుకొండి.

అలా నాకు భక్తి తక్కువ అనే అభిప్రాయం నాది. ... మీరేమంటారు?

Tuesday, August 4, 2009

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు



ప్రతి సంవత్సరం నీను ఎంతగానో ఎదురుచుసే రాఖీ వచ్హేసింది. ..
బ్లాగు మిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు....